ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా..ఒదిగి ఉండాలంటారు. వచ్చిన కష్టాలను ఎదుర్కొంటూ..అంచెలంచెల స్థాయికి ఎదిగిన వారు ఎంతో మంది ఉన్నారు. సమాజ మేలు కోసం ఆయన ఆలోచించారు. రైతుగా ప్రారంభించి..పారిశ్రామిక రంగంలో ఒక విప్లవం సృష్టించి..పుట్టిన ఊరిని..గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు. రాజకీయ నాయకులకు, ఇతరులకు ఆయన స్పూర్తి అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన పేదలకు కూడా ఎంతో సహాయం చేశారు. ఆయనే.. పాతూరి నాగభూషణం. ఆయన గురించి తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా రెండు వందల ఎకరాల్లో కరివెపాకు, కూరగాయలు, పండ్లు సాగు చేస్తున్నారు. సక్సెస్ ఫుల్ వ్యక్తిగా ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తున్నారు. కేవలం డబ్బులు సంపాదించడమే కాదు...తోటివారికి ఉపయోగపడాలనే మంచి మనస్సున వ్యక్తి ఆయన. మంగళగిరి పెదవడ్లపూడి గ్రామంలో పాతూరి వెంకటేశ్వర రావు, సామ్రాజ్యం పుణ్య దంపతులకు వారు జన్మించారు. తల్లిదండ్రులు చూపిన అడుగుజాడల్లోనే నడిచారు. వ్యవసాయంతో మొదలు పారిశ్రామిక రంగం వరకూ ఎంతో మందికి ఉపాధి కల్పించిన ఘనత ఆయనకు దక్కుతుంది. తాను పండించిన కరివెపాకును గ్రామాలు..ఇతర గ్రామాల్లో టేస్టు చేయడం ఎంటీ? అని ఏకంగా విమానాల్లో ఎక్కించిన ఆదర్శ రైతు. ముంబై, ఇతర రాష్ట్రాల్లే కాకుండా..దుబాయ్ వంటి దేశాలకు కరివెపాకు రుచిని చూపించారు. కరివెపాకు పొడిని..సైతం..సంజీవని పేరిట ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఒక్కమాటలో చెప్పాలంటే కరివెపాకుకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చారంటే..ఆయన కృషి వెనుక ఎంతటి కష్టం దాగుందో అర్థం చేసుకోవచ్చు. వ్యాపారంలోనే కాకుండా..ప్రజా సేవ చేయాలనే మంచి ఉద్ధేశ్యంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ఎటువంటి అవినీతి మచ్చ లేకుండా గుంటూరు జిల్లాకు రెండుసార్లు జిల్లా పరిషత్ ఛైర్మన్ గా సేవలందించారు. గ్రామాలను అభివృద్ధిలో దూసుకపోయే విధంగా వ్యవహరించారు. 2006లో తన సతీమణిని నిలబెట్టి ఉమ్మడి రాష్ట్రంలో సర్పంచ్ గా మొదటి అత్యధిక మెజార్టీ సాధించారంటే..ఆయన పట్ల ప్రజల్లో ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. రామినేని ఫౌండేషన్ ఛైర్మన్ ధర్మ ప్రచారక్ తో కలిసి... ఫౌండేషన్ కన్వీనర్ గా వ్యవహరించారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి విషిశ్ట మరియు విశేష పురష్కారాలు అందించారు. ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి ఉత్తీర్ణులై మండల టాపర్స్ గా నిలిచిన ఐదు వందల మంది విద్యార్థులకు స్కాలర్ షిప్ లు, ఇతర విద్యార్థులకు పురస్కారాలు అందచేస్తూ... వారి మనస్సులో నిలిచిపోయారు. రామినేని ఫౌండేషన్ కన్వీనర్ గా గత 20 ఏళ్లుగా ఉంటూ ఇంకా కొనసాగుతున్నారంటే..ఆయన ఎలాంటి వ్యక్తో ఇట్టే అర్థమౌతుంది. ఇక లాక్ డౌన్ లో వివిధ ప్రాంతాల్లో ఉన్న పేదలకు నిత్యావసర సరుకులు అందించారు.. ఆకలితో అలమిటిస్తున్న వారికి భోజన ప్యాకెట్లు అందించి..కడుపునిండా తినేలా చేశారు. అంతేగాకుండా.. సొంత గ్రామాలకు వెళ్లిపోతున్న వేలాది మంది వలస కార్మికులకు ఆహారం..పాదరక్షలు కూడా అందించి మానవతామూర్తి అనిపించుకున్నారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవలు చేసిన పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు, హ్యాండ్ శానిటైజర్, అలాగే మాస్కులు అందించారు. అటు వ్యవసాయం, ఇటు పారిశ్రామిక రంగాల్లో ఎంతో అనుభవం ఉన్న ఈయనలో ఓ ఆధ్మాతిక భావన కూడా ఉంది. భగవంతుడికి కూడా సేవలు చేస్తున్నారు. ఎంతో మంది భక్తులకు సహాయం చేస్తున్న ఈయన్ను ఎంతో మంది మంచి మనస్సుతో ఆశీర్వదిస్తున్నారు. పెదవడ్ల పూడి గ్రామంలో ఆలయాన్ని నిర్మించి. ప్రతిష్టించిన రోజు అయిన..ఫిబ్రవరి 03వ తేదీన సుమారు లక్ష మందికి దర్శనంతో పాటు వారికి అన్నదానం చేస్తున్నారు. అలాగే గుడికి సమీపంలో గోశాలను ఏర్పాటు చేసి గోవుల సంరక్షణ కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. కృష్ణా నది తీరాన శివలింగ స్వరూపాన్ని ప్రతిష్టించడం, అలాగే రాధాకృష్ణుల ఆలయాన్ని నిర్మించి ఆధ్మాత్మిక వాతావరణం వెల్లువిరిసే విధంగా వ్యవహరించారు. ఇంకో కీలక విషయం... భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న ప్రజా సేవలకు పాతూరి నాగభూషణం ఆకర్షితులై ఆధ్మాత్మికమైన కార్యక్రమాలు చేస్తున్నారు. కోట్లాది మంది హిందూ ప్రజల కల మోదీ సాకారం చేస్తున్న సంగతి తెలిసిందే. చారిత్రక అయోధ్య నగరంలో రామ మందిరం నిర్మాణం చేపడుతున్నారు. దేశ వ్యాప్తంగా నిధులు అందించడానికి కృషి చేశారు నాగభూషణం గారు. రామ మందిర నిర్మాణ అవశ్యకత, దాని గురించి..ప్రజలకు వివరించారు. అంతేగాదు..విరాళాలు చందాలు సైతం సేకరించి అయోధ్యకు పంపించారు. మొత్తంగా...కన్న ఊరికి..ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న పాతూరి నాగభూషణం గారిపై ఎంతోమంది ప్రశంసలు కురిపిస్తున్నారు.
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
|